ఉయ్యాల సుకుమార్ 41వ జయంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ - పాల్గొన్న కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ
సమాజ సేవే నిజమైన నివాళి అంటూ ప్రముఖుల అభినందనలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 3:
కోరుట్ల పట్టణానికి చెందిన దివంగత ఉయ్యాల సుకుమార్ 41వ జయంతి సందర్భంగా ఆయన తండ్రి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఉయ్యాల నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, కంపాస్ బాక్సులు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ రేగొండ విజయ్, జగిత్యాల వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంధాని పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా మెట్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్ల సాయన్న, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా. పేట భాస్కర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బలిజ రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఉయ్యాల శోభన్, పసుల కృష్ణ ప్రసాద్, ఉయ్యాల శేఖర్, అలాగే సుకుమార్ స్నేహితులు గిన్నెల శ్రీకాంత్, రేగొండ శిరీష్, అయిండ్ల గణేష్, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ రేగొండ విజయ్లను ఘనంగా సన్మానించారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ, జయంతి వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా విద్యపై ఆసక్తి పెంపొందుతుందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు భావితరాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.





0 Comments