సైబర్ నేరాల నియంత్రణకు మరింత పటిష్ట చర్యలు
ప్రజల్లో అవగాహన పెంచి మోసాలను అరికట్టాలి - రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్
📍 హైదరాబాద్ / ప్రజా దండోర న్యూస్,
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు జిల్లాల వారీగా మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఆదేశించారు. సైబర్ మోసాలకు గురై నగదు కోల్పోయిన బాధితులకు సాధ్యమైనంత త్వరగా నగదు తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గురువారం రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైబర్ నేరాల నివారణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, బాధితులకు నగదు రిఫండ్ ప్రక్రియ, కేసుల దర్యాప్తు పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ భద్రతపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
అలాగే 1930 సైబర్ హెల్ప్‌లైన్ మరియు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో అన్ని జిల్లాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మోసాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
జగిత్యాల జిల్లా నుంచి పాల్గొన్న అధికారులుఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐపీఎస్, సైబర్ క్రైమ్ మరియు ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణమూర్తి, శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.


0 Comments