భర్తను చంపిన భార్యను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్పల్లి డిఎస్పి ఏ. రాములు గారు నిన్న రాత్రి అల్లమయగుట్టలో హత్యకు గురైన ఇప్ప కాశిరం హత్య పూర్వపురాలు గురించి వివరించారు .
ఇప్ప కాశిరాం, 35 సంవత్సరాలు, అతను కోరుట్లలోని అలమయ్య గుట్టకు చెందిన రజినితో గత 14 సంవత్సరాల క్రితం వివాహమైనది వారికి ఇద్దరు పాపలు ఒక బాబు కలరు.గత కొన్ని రోజుల క్రితం భర్త తో పాటు భార్య రజిని కూడా మద్యం తాగినది అని ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ రోజు నుండి మద్యం తగిన విషయాన్ని మనసులో పెట్టుకొని భర్త కాశీరం ప్రతిరోజు మద్యం తాగి వచ్చి భార్య రజిని కొడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని అతని వల్ల తనకు తన పిల్లలకు ప్రతి విషయం లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని గత 20 రోజుల క్రితం తన భార్య రజిని భర్తను చంపాలని కర్రతో దాడి చేయగా తమ ఇంటి పక్కనవున్నా వారు వచ్చి అతనిని కాపాడి ఆసుపత్రికి తరలించి కాశీరాo ను బ్రతికించారు.
మరల తేదీ 8- 7-2026 రోజున కాశీరాం తన కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం చెట్ల పండగ వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి బయటకు వెళ్లినాడు. రజిని తన భర్తను చంపాలని ఆలోచనతోటి తన పిల్లలను ముందుగానే తన తల్లి గారింటికి పంపి మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త తో ఉద్దేశపూర్వకంగా గొడవపడి నా అందాజ రాత్రి 11 గంటల 45 నిమిషాలకు సరిఅయిన సమయం గా భావించి కాశి రామని తన ఇంటిలోని రోకలిబండతో తలపై మరియు ఇతర చోట్ల బలంగా కొట్టగా తలపై తీవ్ర రక్త గాయాల వల్ల మృతులు కాశీరాం అక్కడికక్కడే చనిపోయినాడు. అనంతరం ఇంటి నుండి పారిపోయి అయ్యప్ప స్వామి ఆలయం వెనకాల ఉన్న బంధువుల దగ్గర పడుకొని ఈరోజు పారిపోతుండగా నమ్మదగిన సమాచారంతో సీఐ, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకొని హత్యకు ఉపయోగించినటువంటి రోకలిబండను స్వాధీన పరుచుకోవడం జరిగినది.
ఇట్టి దర్యాప్తులో నేరం రుజువు చేయటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అరెస్టు చేసిన సిఐ, ఎస్ఏ, లను డి.ఎస్.పి అభినందించారు.
0 Comments