బాలే ఇస్తారు మృతి దళిత బహుజన వర్గాలకు తీరనిలోటు కన్నీటి నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు

 



బాలే ఇస్తారు మృతి దళిత బహుజన వర్గాలకు తీరనిలోటు కన్నీటి నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు

అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

ప్రజా దండోర న్యూస్ / కథలాపూర్ ప్రతినిధి, ఏప్రిల్ 24 :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన మాజీ ఎంపీటీసీ సీనియర్ దళిత సంఘాల నాయకులు బాలే ఇస్తారు మృతి దళిత బహుజన వర్గాలకు తీరనిలోటు అని జిల్లాకు చెందిన పలువురు అంబేద్కర్ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.

శుక్రవారం బొమ్మేన గ్రామంలో జరిగిన ఆయన అంతిమ యాత్రలో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున వివిధ సంఘాల నాయకులు, స్నేహితులు పాల్గొని కన్నీటి నివాళులు అర్పించారు.

 ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మృదు స్వభావం గల బాలే ఇస్తారు ప్రజా ప్రతినిధిగా,  అంబేద్కర్ సంఘాల నాయకుడిగా అనేక సేవలు చేశారని ఈమధ్యనే గ్రామంలో కులానికి సంబంధించిన స్థలంలో అందరూ కలిసి బాబు జగ్జీవన్ విగ్రహం ఏర్పాటులో కొన్ని సంఘటనలు ఆయనను బాగా కృంగదీశాయని దానితో బిపి షుగర్ లెవెల్స్ పెరుగి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారని ఆయనకు ఇద్దరు చదువుకునే కుమార్తెలు ఉన్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని నాయకులు కోరారు.

ఈసందర్భంగా స్థానికుడు హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రముఖ ఇంజనీర్ జి. మల్లికార్జున్ ఇస్తారు కూతురు చదువులకయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇవ్వడం మనిషి మనసుకున్న స్నేహ సంబంధాన్ని పెంపొందించింది.

ఈ అంతిమ యాత్రలో ఖానాపూర్ కు చెందిన బొమ్మేన రాజ్ కుమార్ బృందం ఆయనపై కన్నీటి గీతాలు ఆలపించారు.

ఈకార్యక్రమంలో కథలాపూర్ అంబేద్కర్ సంఘాల నాయకులు భూమ గంగారాం, చిన్నయ్య, కిషన్, తెడ్డు గంగాధర్,రాజం, సంజీవ్, నరేష్, పలువురు పాస్టర్లు జిల్లా నలుమూలలకు చెందిన దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Post a Comment

0 Comments