సీనియర్ న్యాయవాది సత్యార్థప్రకాశ్ పై దాడిని నిరసిస్తూ కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన
దాడికి పాల్పడిన నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 27:
సీనియర్ న్యాయవాది గంగుల సత్యార్థప్రకాశ్ పై దాడి హేమమైన చర్య అని న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఇట్టి విషయం ప్రజలకు ఒక చర్చలు మారిందని తెలుపుతూ సోమవారం కోరుట్ల లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ ఒక సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం హేమమైన చర్యని న్యాయవ్యవస్థలో న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి దాడి వెనుక ఎంతటి వారున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 24 శుక్రవారం రాత్రి ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్న పోలీసులు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బార్ అసోసియేషన్ పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఒక సీనియర్ న్యాయవాదిపై ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ఇప్పటికైనా పోలీసులు నిందితులను త్వరగా అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నిందితులను పట్టుకునే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ పక్షాన కోరుట్ల సీఐ లక్ష్మినారాయణ కు వినతి పత్రాన్ని అందజేస్తూ నిందితులను పట్టుకొని శిక్షించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

0 Comments