హోలీ పండుగ శాంతి సౌభ్రాతృత్వం తో పాటు సామాజిక ఐక్యతకు నిదర్శనం -డా. పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ :
శీతాకాలం ముగిసి ప్రకృతి రంగు రంగుల పూలతో కళకళలాడే వసంత రుతువు ప్రారంభానికి సంకేతంగా హోలీ పండుగ ను భావిస్తారని ఇది భారత దేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు జరుపుకునే ఆనందాల పండుగని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.
మంగళవారం కోరుట్ల లోని తన కార్యాలయంలో హోలీ పండుగ మరియు తన జన్మదినోత్సవం పురస్కరించుకొని పేట భాస్కర్ మాట్లాడుతూ శాంతి సౌభ్రాతృత్వం తో పాటు సామాజిక ఐక్యతకు హోలీ పండుగ నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే ఈరంగుల పండుగ సమాజంలో ఐక్యతను మరింత పెంపొందిస్తుందని తెలిపారు.
హోలీ పండుగ ప్రజల జీవితాలను సప్తవర్ణ శోభితం చేసి సుఖసంతోషాలతో నింపాలని పేట భాస్కర్ ఆకాంక్షించారు.

0 Comments