ఘనంగా ప్రజా నేస్తం డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలు

 












ఘనంగా ప్రజా నేస్తం డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలు 


ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ 

తెలంగాణ ఉద్యమ నేత, ప్రజాసంఘాల జేఏసీ అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాదండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. 

కోరుట్లలో మంగళవారం పేట భాస్కర్ నివాసంలో తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు భాస్కర్ ను శాలువాలతో సన్మానించి బర్త్డే కేక్ తినిపించారు.

 ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పేట భాస్కర్ ఎదగాలని ఇప్పటికే అనేక ఉద్యమాల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేతగా జాతీయ సేవా రత్న, రాష్ట్ర ప్రభుత్వం చే దళిత రత్న అవార్డులతో పాటు ఆసియా ఇంటర్నేషనల్ రిసోర్స్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు పొందిన ఘనత పేట భాస్కర్ గారిదని, ప్రజా నేస్తం ఎన్జీవో సంస్థతో పాటు ప్రజల పక్షాన ఢీ అంటే ఢీ అంటు ప్రజా దండోరా తెలుగు దినపత్రిక సంపాదకులుగా పత్రికను దిగ్విజయంగా నడిపిస్తున్నారని కొనియాడారు.ఈకార్యక్రమంలో పలు సంఘాల నాయకులు బొనగిరి మల్లారెడ్డి, జాగర్ల రాజయ్య, శనిగారపు రాజేష్, ఎస్ రాజయ్య, మహేష్, కుమార్, ప్రభాస్, సురేష్ లు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments