సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, తెలంగాణ జాయింట్ సెక్రటరీ, కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి :
నిన్న సిద్దిపేట కోర్టు ఆవరణలో న్యాయవాది కుంచెం అశోక్ లీగల్ నోటీస్ పంపిన కారణంగా ప్రత్యర్థులు భౌతికంగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన, న్యాయవ్యవస్థను అవమానించే చర్యగా బైరి విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
ఈ దాడికి నిరసనగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని కోర్టుల విధులను నిలిపివేసి, న్యాయవాదులు కోర్టు ముందు భారీ ధర్నా నిర్వహించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని, ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై ఇలాంటి భౌతిక దాడులు జరగకుండా నిరోధించాలంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి తీసుకురావాల్సిన అత్యవసర అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.
సిద్దిపేట న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరారు. న్యాయవాదుల భద్రతకు భరోసా కల్పించే వరకు న్యాయవాదుల పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.


0 Comments