పొక్సో చట్టం పై అవగాహన సదస్సులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు..

 


పొక్సో కేసులకు కేరాఫ్ అడ్రస్ బుగ్గారం


పొక్సో చట్టం పై అవగాహన సదస్సులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు..

ప్రజా దండోర న్యూస్ / బుగ్గారం ప్రతినిధి :

బుగ్గారం ఎస్సై సతిష్ తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలంలోని ఒక గ్రామంలోని 59 సం. ఉన్న వ్యక్తి అదే గ్రామానికి చెందిన  07 సం. బాలిక  మీద  అత్యాచారం చేయగా బాలిక  యొక్క తల్లి ఇచ్చిన పిర్యాది మేరకు నింధితుడు మీద పొక్సో చట్టం క్రింద కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది అని ఎస్సై తెలిపారు.
ఇది ఇలా ఉండగా గత 10 రోజుల క్రితం మండలం లోని ఓ గ్రామములో  పొక్సో కేసు నమోదయిన విషయం తెలిసిందే వివరాలు చూడగా  బుగ్గారం మండలం లోని ఓ గ్రామములో 44 సంవత్సరాల వ్యక్తి తన కూతురు స్నేహితురాలు అయిన 14 సంవత్సరాల అమ్మాయిని లోబర్చుకోవడం తో గత పది రోజుల క్రితం ఆ అమ్మాయి కోడుకుకు జన్మనివ్వడంతో బెంబేలెత్తి పోయిన బుగ్గారం మండల ప్రజలు... ఆపేరేషన్ చేసిన డాక్టర్స్ ఇచ్చిన పిర్యాదు మేరకు పొక్సో కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని రిమాన్డ్ కి తరలించిన విషయం తెలిసిందే..

ఇలాంటి సభ్యసమాజం తల దించుకొనే సంఘటన మరువక ముందే ఇదే బుగ్గారం మండలం లో 59 సంవత్సరాల వ్యక్తి 7 ఏళ్ళ పాపను పాడు చేయడం తో బుగ్గారం ప్రజలు ఎవరిని నమ్మాలో,ఎవరిని నమ్మకూడదో అమ్మయిలపై ఇలా జరగడం తో ఉక్కిరి బిక్కిరి అవుతూ, బయాందోళనలకు గురి అవుతున్నారు... త్వరలోనే పోలీసులు మరియు మైనర్ బాల బాలికల సంక్షేమ అధికారులు బుగ్గారం మండలం లోని అన్ని గ్రామాల్లో పొక్సో చట్టం పై అవగాహన సదస్సులు నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments