వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్న ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ - సుకన్యలు తన మనవడు వహీన్ వేదాన్స్ కు ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రాముశర్మ వైద్యక నిర్వహణలో అక్షరాభ్యాసం చేయించారు. తల్లి తండ్రులు బొల్లారం అరుణ్ కుమార్ - సుభాషిణి లు వారి పిల్లలు భవిష్య, వహీన్ వేదాన్స్ లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల దీవేనలు పొందారు.
జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం నుండే అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాదాపు 94 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు విజయ కంకణ ధారణ మరియు పుస్తక పూజ నిర్వహించారు. సరస్వతి మాత జన్మ నక్షత్రమైన వసంత పంచమి రోజున నూతనంగా ఈ మంచి పని చేసినా ఫలితం అధికంగా ఉంటుందని అన్నారు. వసంత పంచమి ఉత్సవదాతగా పిన్నంశెట్టి శ్రీనివాస్ -జ్యోతిర్మయి లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తల్లి తండ్రులు, చిన్నారులు, భక్తులు పులిహోర ప్రసాదన్న స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ శాశ్వత గౌరవ అధ్యక్షులు చిద్రాల నారాయణ గురు స్వామి, అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురు స్వామి, ప్రధాన కార్యదర్శి తోటరాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, సాయిరాం, గోపాల్ ,శ్రీరాముల శ్రీనివాస్, కాసు క్రాంతి ,హింసకవి నాగరాజు తులసి కృష్ణ చలిగంటి వినోద్, అలవాల శ్రీనివాస్, రాచమడుగు శ్రీనివాసరావు, ఎన్నామనేని వెంకటేశ్వరరావు, కల్లూరు సాయి తదితరులు పాల్గొన్నారు.


0 Comments