ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతోత్సవాలు - నివాళులర్పించిన డా. పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, అక్టోబర్ 4:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ కోరుట్ల పట్టణంలోని జువ్వాడి విగ్రహానికి తన తనయుడు జువ్వాడి కృష్ణారావుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ జయంతోత్సవాల కార్యక్రమంలో జువ్వాడి తనయులు తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, పిసిసి సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావు, డిసిసి జిల్లా అధ్యక్షుడు నందయ్య, కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజిరెడ్డి లతో కలిసి జయంతోత్సవాలలో పాల్గొన్న పేట భాస్కర్ మరియు నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. పేట భాస్కర్ మాట్లాడుతూ.. జువ్వాడి రత్నాకర్ రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన రాజకీయ, సామాజిక ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రత్నాకర్ రావు ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని డా. పేట భాస్కర్ పేర్కొన్నారు.


0 Comments