అహింసతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్



అహింసతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ 

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02:

మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. స్వాతంత్రం కోసం గాంధీజి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందిని అన్నారు. దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలు అందించాలని ఆయన ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని అన్నారు. గాంధీజీ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఆయన ఆశయాలను కొనసాగించడమే మనo ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.


ఈ కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, RI లు వేణు, సైదులు, RSI లు,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments