ఈనెల 30న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

 


ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం 

ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డుతో పెన్షన్ సౌకర్యం కల్పించాలి.. 

• ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 26

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రత్యేక గుర్తింపు కార్డు మంజూరు చేసి, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.


శనివారం కోరుట్లలోని జేఏసీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజమైన ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, వారి హక్కులు మరియు సంక్షేమం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించడమే లక్ష్యంగా  తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30 బుధవారం రోజున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం పాల్గొంటారని కావున ప్రజాసంఘాల జేఏసీ నాయకత్వంలో ఉద్యమించిన నాయకులందరూ విధిగా హాజరుకావాలని పేట భాస్కర్ కోరారు.  ఉద్యమకారులందరూ పార్టీలకు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జేఏసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అలిశెట్టి గంగారెడ్డి, కోరుట్ల డివిజన్ జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శంకర్, రేగుల మోహన్, ఇట్యాల రాజేందర్, కార్యదర్శులు రామిల్ల రాంబాబు, ఆకుల మదన్, జేఏసీ టౌన్  అధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments