ఈ నెల 20న జగిత్యాలలో జరిగే.. బాంసెఫ్, రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 13వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19:
బాంసెఫ్ (BAMCEF), ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు రాష్ట్రీయ మూలనివాసి సంఘ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 ఆదివారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో నిర్వహించనున్న 13 వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు.
శనివారం కోరుట్లలో టీఎస్ డబ్ల్యూజెఎ రాష్ట్ర అధ్యక్షుడు అలీ నవాబ్, మైనార్టీ యునైటెడ్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజాహిద్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు శనిగారపు రాజేష్ లతో కలిసి పాత్రికేయులతో పేట భాస్కర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగుల సమస్యలు, హక్కులు, సామాజిక అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నారు అని తెలిపారు.
ఈ మహాసభ ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనుంది. పొన్నాల గార్డెన్, తులసి నగర్, జగిత్యాల, తెలంగాణ వేదికగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రారంభ సమావేశం నిర్వహించనున్నారు.
మహాసభకు బాంసెఫ్ జాతీయ అధ్యక్షులు మాన్యులు వామన్ మెశ్రామ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ఉద్యోగుల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజన సమాజ సాధికారత తదితర అంశాలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పేట భాస్కర్ స్పష్టం చేశారు.
ఈసమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ ముంబై నేత శనిగారపు నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు


0 Comments