మిత్రులందరికీ 'స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు' - డా. పేట భాస్కర్
మన స్నేహం ఒక మంచి నీటి సరస్సు...
ఎంత తోడినా... ఎంత పంచినా... ఎన్నటికీ తరగనిది.. అదే స్నేహ మాధుర్యం...!
స్నేహితులను సంపాదించడం ఒక గొప్ప కళ... అలాంటి స్నేహితులు దొరకడం ఒక అరుదైన అదృష్టం.
కాలం మారవచ్చు...
మన జీవిత స్థాయిలు మారవచ్చు...
పరిస్థితులు మారవచ్చు...
కానీ స్నేహం మారకూడదు.
ఆ బాధ్యత ఇద్దరు స్నేహితులదే.
కులం, మతం, ప్రాంతం, హోదా...
అన్నింటినీ దాటి మనసులను కలిపేది స్నేహం.
రక్త సంబంధం లేకపోయినా...
హృదయ సంబంధాన్ని నిర్మించేది స్నేహమే.
కష్టాల్లో చేయి అందించేది...
సంతోషాల్లో మనసారా నవ్వేది...
విజయంలో అభినందించేది...
వైఫల్యంలో ధైర్యం చెప్పేది...
నిజమైన స్నేహితుడే.
స్నేహం అనేది అవసరాల కోసం ఏర్పడే బంధం కాదు...
ఆప్యాయతతో నిలిచే అనుబంధం.
ఒంటరి జీవితాన్ని ఆనందంగా మార్చే వెలుగు...
నిరాశలో ఆశను నింపే బలం...
మనిషికి మనిషిని దగ్గర చేసే మహోన్నత విలువ... స్నేహం..!
అందుకే...
స్నేహానికి మించిన సంపద లేదు...
విశ్వాసానికి మించిన బంధం లేదు...
నిజమైన స్నేహితుడికి మించిన వరం ఈ లోకంలో లేదు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ..
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు! 💐
— డా. పేట భాస్కర్ 🌹



0 Comments