మైతాపూర్‌లో బొమ్మెన సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / రాయికల్ ప్రతినిధి, ఆగస్టు 1 :
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన సాయిలు భార్య లక్ష్మి ఈమధ్యనే మృతి చెందడం పట్ల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక - ఎడిటర్ డా. పేట భాస్కర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
శనివారం మైతాపూర్ లో జరిగిన లక్ష్మి ద్వాదిశకర్మ లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బొమ్మెన సాయిలును వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు, బండెడు దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. అలాన పాలన చూసే ఇంటి భాగస్వామిని కోల్పోవడం తీరని లోటని ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైతాపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బొమ్మెన బాబు , ప్రకాష్, మెడపట్ల అజేయ్, వన్నెల వికాస్, రంజీత్, సుద్దాల విజయ్, నాగయ్య, గంగాధర్, తిరుపతి తదితరులు పాల్గొని లక్ష్మికి ఘనంగా నివాళులర్పించారు.

0 Comments