రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో జిల్లా అంబేద్కర్ యువజన సంఘాల నాయకుల భేటీ
దళితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి – మంత్రికి ఘన సన్మానం
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 29:
జగిత్యాల జిల్లా మరియు కోరుట్ల నియోజకవర్గానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత, బహుజన వర్గాల సంక్షేమం, దళిత యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లోని దళిత వాడలకు మౌలిక వసతుల అభివృద్ధి మరియు కోరుట్ల కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
నాయకుల వినతులను శ్రద్ధగా విన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, వుయ్యాల నర్సయ్య, కోరుట్ల నియోజకవర్గ సీనియర్ నాయకుడు బర్ల సాయాన్న, కొంతం రాజం, వుయ్యాల శోభన్, బడే లక్ష్మణ్, పోతు అశోక్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దుమాల రాజ్ కుమార్, బొల్లె గంగారాం, సర్పంచ్ భూమేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి దుమాల గంగారాం, బోనగిరి కిషన్, చెట్పల్లి లక్ష్మణ్, రాజయ్య లు, శనిగారపు రాజేష్ , జీవన్, రమేష్, సంపత్, నరేష్, గంగనర్సయ్య, రాజశేఖర్, శంకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.




0 Comments