స్త్రీ మూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -డా. పేట భాస్కర్
ఓ పంజరంలో చిలకల్లారా..!
రంగుచీరలు కట్టుకున్న రమణీమనునుల్లారా..
నిప్పులు చిమ్ముకుంటూ సమాజన్ని శాసించండి.
ఇల్లు కడిగి, గడపలకు పసుపులు రాసి వాకిట్లో ముగ్గులెడుతుంటే..ప్రేమ గట్టిపడి ప్రాతివ్రత్యం డోకలేకుండా ఐదోతనానికి నాంది పలికిందనుకుంటున్నారా..
భర్త ఎంగిలి తిళ్ళు తినడమే స్త్రీ ఔన్నతకు నిదర్శనమనుకుంటున్నారా..డబ్బెట్టి ఆడపిల్ల..మెుగుడ్ని కొనుక్కొని..చెప్పుల జోడు దగ్గర్నుంచి తండ్రి పచ్చినెత్తురు వరకు కర్చుబెట్టించి..వెట్టి సాకిరి చేస్తూన్న ఓ ఆడపడుచుల్లారా..
మీరు చేసిన దానిలో ఎన్నోవంతు మగాళ్ళు చేస్తున్నారో పశ్నించారా..లేటెస్ట్ ఫ్యాషన్ గా మగాళ్ళా జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ అనుకరిస్తున్న ఓ వెండి కుంకుమభరణీల్లారా...
మగాళ్ళు మాత్రం ఆడాళ్ల వేషభాషలు, కట్టు బొట్టు బానిస చిహ్నలుగా చుస్తుంటే ఆలోచించారా..! జీవితాంతం మగాడ్ని తాళికట్టినందుకు..వలపు సొగసు సోయగాల్ని గుమ్మరిస్తు మాతృమూర్తులై..పిల్లల్ని పెంచి పెద్ద చేసి..మళ్ళా వాళ్ల చేత నీతులు చేప్పించుకొనె దుర్గతి పట్టిందా.. ఓ సౌందర్యమూర్తుల్లారా..
ఇకనైనా స్త్రీ వాదన్ని స్థాపించండి..! నిప్పులు చిమ్ముకుంటూ సమాజన్ని శాసించండి. మీ- ఎడిటర్ డా. పేట భాస్కర్ / ప్రజా దండోర న్యూస్..💐💐💐

0 Comments