కోరుట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.78 కోట్లు మంజూరు చేయాలి - మంత్రి కోమటిరెడ్డిని కోరిన జువ్వాడి


కోరుట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.78 కోట్లు మంజూరు చేయాలి 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరిన జువ్వాడి నర్సింగ్ రావు

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, సెప్టెంబర్ 15:

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కలిసి, కోరుట్ల నియోజకవర్గంలోని పలు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు గాను సుమారు రూ.78 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.



కల్లూర్ హైలెవల్ బ్రిడ్జి, సిరిపూర్–చిట్టాపూర్ రోడ్డును రెండు వరుసల రహదారిగా విస్తరణ , నేషనల్ హైవే–యూసఫ్ నగర్ రోడ్డును రెండు వరుసల రహదారిగా విస్తరణ,మొగిలిపేట గ్రామంలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం,వర్షకొండ–గోధూర్ రహదారి రెన్యువల్ , మెట్‌పల్లి–దామ్ రాజ్ పల్లి–ఖానాపూర్ రోడ్డు రెన్యువల్ తో పాటు రంగారావుపేట–కేసీఆర్ తండా సమీపంలో స్లాబ్ కల్వర్ట్, వెల్లుల గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

జువ్వాడి నర్సింగ్ రావు గారి విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ లేఖ పంపించారు.

Post a Comment

0 Comments