పెద్దపల్లి జిల్లాలో దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ - ప్రజా దండోర


 పెద్దపల్లి జిల్లాలో దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ 

ప్రజా దండోర న్యూస్  / బత్తుల శంకర్, స్టేట్ బ్యురో, జూన్ 09                  

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య సినిమా డైరెక్టర్ సేనాపతి ఆధ్వర్యంలో ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పలు సంఘాల నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు.

ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ గారి‌ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా బస్టాండు నుంచి నందన గార్డెన్ కు వెళ్లి నందన గార్డెన్లో దొడ్డి కొమురయ్య సినిమా సహాయ నిర్మాతలను శాలువాలతో ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు తదనంతరం వక్తలు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య గురించి ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. 


దొడ్డి కొమురయ్య సినిమా అతి తొందరలో తీస్తామని మహనీయుల చరిత్రను ఒకటొక్కటిగా సినిమా రూపంలో సమాజానికి పరిచయం చేస్తామని దొడ్డి కొమురయ్య సినిమా డైరెక్టర్ సేనాపతి వెల్లడించారు.  సహాయ నిర్మాతలు పెద్దపల్లి కోర్టు పి పి డొంకెన రవి,  దొడ్డి కొమురయ్య పెద్దపల్లి జిల్లా చైర్మన్ బత్తుల శంకర్ సహాయ నిర్మాత సహా నిర్మతలు తెలంగాణ ఉద్యమకారులు నూనె రాజేశం, పోతు జ్యోతి రెడ్డి, బి వనజ, కాంకటి తాడూరి శ్రీమాన్, కామిని రాజేశం, శ్రీనివాస్, ములుగు నరేష్, గాజుల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments