జగిత్యాలలో హౌసింగ్ డీఈగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ — ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మొక్క బహుకరణ
ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ :
జగిత్యాల హౌసింగ్ డీఈగా నూతనంగా నియామకం అయిన సత్యనారాయణ ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఎమ్మెల్యేకు మొక్కను బహుకరించారు.
జగిత్యాల నియోజకవర్గంలో హౌసింగ్ శాఖ అభివృద్ధి పనులను సమర్థంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హౌసింగ్ శాఖకు సంబంధించిన పనులను పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీడీ ప్రసాద్, ఏఈ భార్గవ్ పాల్గొన్నారు

0 Comments