Arrive Alive కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు – రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన.
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :
రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని IMA హాల్ లో “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ మరియు ఇతర వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజులో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని ఈ రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల జరిగే ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాక అద్వారాయంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రజల్లో అలవాటు చేయడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం మరియు చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వలననే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు, దీర్ఘదూర ప్రయాణాలు చేసే లారీ మరియు బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైన్ బోర్డులు, ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.
ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు. అవసరమైతే తదుపరి చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రులకు రిఫర్ చేసే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, సీ.ఐ లు కరుణాకర్, రవీందర్,ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేశం డాక్టర్ లు మృదుల రెడ్డి, సుదీప్ , పోలీస్ సిబ్బంది, మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.



0 Comments