కోరుట్లలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కోరుట్ల కోట బురుజుల స్థలాలు అమాయకంగా కొనుగోలు చేయవద్దు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకుల పిలుపు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 11:
కోరుట్ల కోట బురుజుల స్థలాలు నకిలీ దస్తావేజులతో కొనుగోలు చేసినట్లు కొందరు రియల్టర్లు వాటిని ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారని ఈవిషయంలో కోరుట్ల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు అక్కడి స్థలాలను కొనుగోలు చేయవద్దని కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రజలను కోరారు.
శనివారం కోరుట్ల సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆవరణలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతోత్సవాలను పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న వివిధ పార్టీలు మరియు ప్రజాసంఘాల నాయకులు జ్యోతి రావు పూలే ఫోటో కు పూలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన ఈ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు.
ఈసందర్భంగా కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట బురుజుల పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను అక్రమంగా ప్లాట్లుగా చూపిస్తూ విక్రయాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని , వాటిని కొనుగోలు చేసే వారు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున, ఎవరూ ఈ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అక్రమ వ్యవహారాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండి, మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, డా. పేట భాస్కర్, ఎండి ముజాహిద్, చింతా భూమేశ్వర్, రాస భూమయ్య, సుతారి రాములు, భూపేల్లి నాగేశ్వరరావు, రాసకొండ పెద్ధ దేవన్న మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.


0 Comments