కోరుట్ల గడి బురుజు స్థలాల్లో విఎల్టీలు రద్దు చేసి మార్కేట్ యార్డు, పార్కు నిర్మాణం చేయాలని రాస్తారోకో - ప్రజా దండోర

 


కోరుట్ల గడి బురుజు స్థలాల్లో విఎల్టీలు రద్దు చేసి మార్కేట్ యార్డు, పార్కు నిర్మాణం చేయాలని రాస్తారోకో


 నిరసన దీక్షలకు తాత్కాలిక విరామం – తదుపరి కార్యాచరణ కౌన్సిలర్ల సంతకాల సేకరణ

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి,

కోరుట్లలో గడిబురుజు గ్రామకంఠ భూముల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆశాజనకంగా ముగిసింది. ఐదు రోజుల పాటు నిరవధికంగా కొనసాగిన ఈ పోరాటం, ప్రజల ఐక్యత, పట్టుదల ప్రజల సహకారంతో కొనసాగింది.


5వ రోజు దీక్ష లో కూరగాయల అమ్మే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలు దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం కార్గీల్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. గడి బురుజులు స్థలాలు కాపాడాలని, విఎల్టీలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు రాకపొకలు స్తంభించాయి.



ఈసందర్భంగా దీక్షలో పాల్గొన్న కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత భర్త కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ గడిబురుజు స్థలాలలో నమోదైన విఎల్టీలపై మున్సిపల్ అధికారులతో చర్చించి అన్ని పార్టీల సహకారంతో రద్దు చేయిస్తామని, ఆ స్థలాలను ప్రజా ప్రయోజనాల కు ఉపయోగపడేల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు తో మాట్లాడి అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.



బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విఎల్టీల రద్దు అంశాన్ని ప్రస్తావించి తీర్మానం చేయీస్తానని అలా కాని పక్షంలో అ విఎల్టీల రద్దుకై జిల్లా కలెక్టర్ కు కౌన్సిల్ పక్షాన పిర్యాదు చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం నిరసన దీక్ష చేస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చింత భూమేశ్వర్, ముజుబీర్ రహెమాన్, సుతారి రాములు, షాహేద్ మహ్మద్ షేక్ లకు కొబ్బరి బొండాలు ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.


ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, టిడిపి ఇంచార్జీ మానుక ప్రవీణ్, బిసి సంఘాల నేత శికారి గోపి మహిళా నాయకురాలు హన్మక్కతో పాటు దాదాపు 50 మంది మహిళలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments